ఏపీ రాజకీయల్లో అనంతపురం జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ శింగనమల నియోజవర్గానికి మరింత ప్రత్యేకత ఉంది. ఇక్కడ పోటీ నువ్వానేనా అన్నట్లు ఉంటుంది. ఇలాంటి హాట్ సీట్ పై ఓ సామాన్యుడిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వీరాంజనేయులు అనే వ్యక్తిని శింగనమల వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని చూసుకునే వారు. వీరాంజనేయులు, వీరా.. ఇలా ఏ పేరుతో పిలిచినా పలికే వ్యక్తిగా స్థానికంగా మంచి గుర్తింపు ఉంది.వీరాంజనేయులు 2014 ఎంఎడ్ ను పూర్తి చేశారు. అనంతరం ప్రజలకు సేవ చేయాలనే కోరికతో రాజకీయాల్లోకి వచ్చారు. తన తండ్రి కూడా గతంలో సర్పంచ్ గా పని చేశారు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వీరాంజనేయులకు ఎటువంటి ఆస్తులు లేవు. వైఎస్సార్ సీపీకి వీర విధేయుడిగా, పార్టీనే నమ్మకుని ఉన్నారు. అలాంటి వీరవిధేయుడికి, పేద కుటుంబానికి చెందిన వీరాంజేయులకు సీఎం జగన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు.
డబ్బులు ఉంటేనే సీటు అనే విధంగా ఉన్న నేటి రాజకీయాల్లో వీరాంజనేయుల లాంటి పేద వ్యక్తిని చట్టసభల్లోకి పంపే అవకాశం కల్పించారు సీఎం జగన్.ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోట్లకోద్దీ డబ్బుండాలి, అవి ఇస్తేనే.. తమ పార్టీ టికెట్ ను ఇస్తామని చెప్పుకునే నాయకులు ఎందరో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కోట్లాది రూపాయాలు ఇచ్చే వారికే టికెట్లు ఇస్తున్నట్లు ఆపార్టీ నేతలే చెబుతున్నారు. కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం నోట్ల కట్టలు చూడలేదు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, అదే ప్రామాణికంగా వీరాంజనేయులు, మరికొందర నేతలకు సీట్లు కేటాయించారు సీఎం జగన్. నిరుపేద కుటుంబానికి చెందిన వీరాంజనేయులకు టికెట్ కేటాయించి సీఎం జగన్ రికార్డు సృష్టించారు.వచ్చే ఎన్నికల్లో వీరాంజనేయులు ఘన విజయం సాధిస్తే.. ఓ డ్రైవర్..ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో అడుగు పెట్టి రికార్డు సృష్టించనున్నారు.
2019 ఎన్నికల సమయంలోనూ పేద కుటుంబానికి చెందిన నందిగామ సురేష్ ను వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించి గెలిపించారు. ఇలా ప్రజా సంక్షేమం కోసం నోట్ల కట్టలు చూడకుండా అతి సామాన్యులకు సైతం టికెట్లు కేటాయిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తూ… అసలైన రాజకీయాన్ని అర్థం చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.