inter-result
తెలంగాణ ముఖ్యాంశాలు

ఏప్రిల్ చివరి వారంలో  ఇంటర్ ఫలితాలు

 తెలంగాణలో ఇంటర్ పరీక్షలు సజావుగా ముగిశాయి. ఈ ఏడాదికి సంబంధించిన వార్షిక పరీక్షలు… ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం అయ్యాయి. మార్చి 19వ తేదీతో ఈ ఎగ్జామ్స్ అన్ని పూర్తి అయ్యాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 9 లక్షల మందిపైగా స్టూడెంట్స్ పరీక్షలు రాశారు. ఇందులో 4,78,527 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉండగా… 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ఈసారి పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు.మరోవైపు తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. మార్చి 10వ తేదీ తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. ఈసారి కొత్తగా సంగారెడ్డి జిల్లాలోనూ వాల్యూయేషన్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మూల్యాంకన ప్రక్రియను మొత్తం నాలుగు దశల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణను రూపొందించారు. ఇప్పటికే మొదటి విడత వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తి కాగా… ప్రస్తుతం రెండో విడత వాల్యూయేషన్ నడుస్తున్నట్లు తెలిసింది.

ఈ నెలాఖారులోపు నాలుగు విడుతలను పూర్తి చేసేలా ప్లాన్ రూపొందించారు అధికారులు. జవాబు పత్రాల మూల్యాంకనంలో సిబ్బంది ఎలాంటి తప్పులు చేయవద్దని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. గత అనుభవాల దృష్ట్యా…. ఈసారి ఎలాంటి వాటికి అవకాశం ఇవ్వొద్దని సూచించింది. పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా జవాబు పత్రాలను పరిశీలించిన తర్వాతే… మార్కులను ఎంట్రీ చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. వాల్యూయేషన్ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించింది.ఇక ఈసారి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా పరీక్షల నిర్వహణ, ఫలితాలను ప్రకటించే యోచనలో విద్యాశాఖ ఉంది. ఈ క్రమంలో…ఈసారి ఇంటర్ పరీక్షల మూల్యాంకాన్ని త్వరగా పూర్తి చేసి… ఫలితాలను కూడా త్వరగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది చూస్తే మే 9వ తేదీన ఫలితాలనువెల్లడించింది ఇంటర్ బోర్డు. ఆ షెడ్యూల్ ను చూస్తే పరీక్షలు పూర్తి అయిన 30 రోజుల గడువు తర్వాత రిజల్ట్స్ అందుబాటులోకి వచ్చాయి.మొత్తంగా చూస్తే గత ఏడాదితో పోల్చితే.. ఈసారి సాధ్యమైనంత త్వరగా ఫలితాల విడుదల ప్రక్రియను పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.

ఎంసెట్ తో పాటు ఇతర పరీక్షల దృష్ట్యా…. వీలైనంత త్వరగా వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే నెల మూడో వారం లేదా చివరి వారంలో పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాలకు సంబంధించి తుది ప్రకటన ఇంటర్ బోర్డు పేర్కొననుంది. ఇక తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు మే 5వ తేదీ నుంచి ప్రారంభమై… 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. తెలంగాణ ఇంటర్మీడియ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను https://tsbie.cgg.gov.in/home.do వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.పరీక్ష రాసిన విద్యార్థులు https://tsbie.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హోంపేజీలో కనిపించే TS Inter Results 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మీ రూల్ నెంబర్ ను నమోదు చేసి క్లిక్ బటన్ పై నొక్కితే మీ రిజల్ట్ డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.