kavitha-ed
తెలంగాణ రాజకీయం

కవిత బంధువుల ఇళ్లలో దాడులు

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తోంది. కవిత భర్త బంధువుల ఇళ్లలో  నుంచి రైడ్స్‌ జరుగుతున్నాయి. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని కవిత ఆడపడుచు, భర్త అనిల్‌ సోదరి అఖిల ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఉదయం నుంచి రైడ్స్‌ కొనసాగుతున్నాయి. దీంతో… సర్వత్రా  ఉత్కంఠ నెలకొంది.మార్చి 15న హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలపై ఆరా తీసింది. మళ్లీ… ఇప్పుడు కవిత కస్టడీ చివరి రోజున ఈడీ… మరోసారి దాడులు  నిర్వహిస్తోంది. కవిత, ఆమె భర్త బంధువుల ఇళ్లలో ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. కవిత నుంచి ఇప్పటికే సుమారు 16 మొబైల్ ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె భర్త అనిల్‌తో పాటు పీఆర్వో రాజేష్, ముగ్గురు అసిస్టెంట్ల  ఫోన్లను కూడా అధికారులు సీజ్ చేశారు. కవిత పీఏలకు నోటీసులు ఇచ్చి… ఈడీ ఆఫీసుకు పిలిపించుకుని ప్రశ్నించారు.

ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ  ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. మార్చి 16న కవితకు రిమాండ్‌ విధించింది రౌస్‌ ఎవెన్యూ కోర్టు. ఏడు రోజుల పాటు ఆమెను ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈనెల 23న అంటే… ఇవాళ మధ్యాహ్నాం 12గంటలకు కవితను తిరిగి  కోర్టులో హాజరుపరచాలని ఈడీని ఆదేశించింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం కవితను రౌస్‌ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించనుంది ఈడీ. అంతేకాదు… కవిత కస్టడీని మరికొన్ని  రోజులు పొడిగించాలని కూడా కోర్టును కోరే అవకాశం ఉంది. ఈడీ కస్టడీ లేదా జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ కోరనుంది. అయితే… కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది ఉత్కంఠగా మారింది.గత ఆరు రోజులుగా కవితను ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం (ప్రవర్తన భవన్‌)లో ఉంచి ప్రశ్నించారు ఈడీ అధికారులు.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ పలు విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. కవిత ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ప్రకారమే… ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌  చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక… ఈడీ కస్టడీలో ఉన్న కవితను… ఆమె సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్‌, లాయర్‌తోపాటు పలుమార్లు కలిశారు. కోర్టు అనుమతితో… గత రెండు రోజులుగా కుటుంబసభ్యులు కూడా ఆమెను కలిశారు.  కూతురు, కుమారుడు, తల్లి శోభాతోపాటు పలువురు కుటుంబసభ్యులు కవితను కలిసి వచ్చారు. ఇక… ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను కూడా రెండు రోజుల క్రితం అరెస్ట్‌ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ). నిన్న కేజ్రీవాల్‌ను రౌస్‌ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు కేజ్రీవాల్‌ను మార్చి 28వరకు అంటే ఆరు రోజుల పాటు ఈడీ  కస్టడీకి అప్పగించింది. అంటే… ఇవాళ్టి (మార్చి 23) నుంచి కేజ్రీవాల్‌ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్న ఈడీ.

ఇవాళ్టితో ఎమ్మెల్సీ కవిత కస్టడీ కూడా ముగుస్తోంది. ఈ క్రమంలో… కేజ్రీవాల, కవితను కలిపి విచారించే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్  స్కామ్‌లో కవిత పాత్ర, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్‌తో ఒప్పందాలపై కవితను ఈడీ ప్రశ్నించింది. లిఖితపూర్వకంగా వివరాలు సేకరించింది.