holi
తెలంగాణ

అంబరాన్నంటిన హోళి సంబరాలు

తెలంగాణలో హోలీ సంబరాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్స్‌లో యువతీ, యువకులు రంగులు పూసుకుని సంతోషంగా గడిపారు. కేరింతలు కొడుతూ డ్యాన్స్‌లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముందస్తూ హోలీ వేడుకలు సందడిగా సాగాయి. హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్స్‌లు నిర్వహించారు. విద్యార్థులు, స్నేహితులంతా ఒక చోట చేరి సంబరాలు జరుపు కున్నారు హైదరాబాద్ మోడల్స్ ఆధ్వర్యంలో గడ్చిబౌలి సంధ్యా ఫుడ్ కోర్టులో ఘనంగాతో వేడుకలు నిర్వహించారు. సేంద్రీయ రంగులతో ఐదు గంటల పాటు సాగిన ‘కంట్రీ క్లబ్ హోలీ’ సంబరాల్లో యువత పెద్ద సంఖ్యల్లో పాల్గొని జోష్‌గా రెయిన్‌ డాన్స్‌లు చేశారు. మ్యూజిక్ మస్తీలో ఉర్రూతలూగారు. ఆత్మీయులంతా ఒకరికొకరు రంగులు పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలు జిల్లాల్లో యువతీ, యువకులు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ జరుపుకున్నారు.హోలీ అంటే చాలు పిల్లలు, పెద్దలు ఎగిరి గంతేస్తారు.

రంగులతో ఆడుకోవడం అంటే అందరికీ సరదానే. రంగులను ఒకరికి ఒకరు పూసుకో వడం, రంగునీళ్లు చల్లుకుంటూ ఆడుకోవడం, డీజే పాట లకు నృత్యాలు చేస్తుండటం ప్రతీ ఒక్కరికి సరదా. పండగ వేళ రంగులను వ్యాపారులు విక్రయిస్తున్నారు. పిల్లల ఆనందాలను కాదనలేక తల్లిదండ్రులు పలురకాల రంగు లను కొనిస్తారుముందు రోజు నుంచే  హోలీ వేడుకల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా పాండిచ్చేరి నుంచి తెప్పించిన DJ , సంగీత శబ్ధాలకు యువత డ్యాన్స్‌ చేస్తూ ఉత్సాహంగా గడిపారు.ఈ వేడుకల్లో రాజస్థానీ, మార్వాడీ కుటుంబాలు పాల్గొని ఉత్సాహంగా, సందడిగా ఒకరికొకరు రంగులు పూసుకోని నృత్యాలు చేస్తూ… హొలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.మన దేశంలో హోలీ పండుగను అనాదిగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ప్రతీయేట ఫాల్గుణ పౌర్ణమి నాడు ఆనందార్ణవంగా ఈ పండుగను జరుపుకుంటారని లింగపురాణం చెబుతోంది.

ఇక హోలీ పండుగను కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే సంప్రదాయం ఉంది. ప్రకృతిలో వ్యక్తమయ్యే నవచైతన్యానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా హోలీతో ముడిపడిన ప్రధాన గాథ కామదహనం. తన తపస్సును భగ్నం చేసిన మన్మథుణ్ని ముక్కంటి నాథుడు మూడోకన్ను తెరచి భస్మం చేసింది ఫాల్గుణ పౌర్ణమినాడేనని శివమహా పురాణం చెబుతోంది.