దమ్మైగూడ సైలెంట్ ఎవెన్యూలోని శ్రీ కనకదుర్గ మాత దేవస్థానంలో శ్రీ కనకదుర్గ, విజయ గణపతి, శివలింగ, సుబ్రమణ్య స్వామి విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. ఈ నెల 30వ తేదీ మొదలు మూడు రోజుల పాటు నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ మాధవానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా మంగళ వాయిద్యాలు, భక్తుల దైవ నామస్మరణల మధ్య మంత్రోచ్ఛరణలతో యంత్ర విగ్రహ ప్రతిష్ట, ధ్వజ ప్రతిష్ట నిర్వహించారు. అనంతరం పురోహితులు మహా పూజ, బలిహరణం ప్రతిష్ఠ ఉత్సవాల వైదిక కార్యక్రమాల ముగింపుగా మహా పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రతిష్ట ఉత్సవాలలో భక్తులకు మంగళ శాసనాలు అందజేశారు.
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు, ఆభరణాలు సమర్పించారు. టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, దమ్మైగూడ మున్సిపల్ చైర్ పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కౌన్సిలర్ సంపన్న బోల్, స్వప్న హరి గౌడ్ తదితరులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు