extreme heat
జాతీయం ముఖ్యాంశాలు

ఏప్రిల్, జూన్ మ‌ధ్య కాలంలో దేశ‌వ్యాప్తంగా సాధార‌ణం క‌న్నా అధిక ఉష్ణోగ్ర‌త‌లు

ఏప్రిల్ నుంచి జూన్ మ‌ధ్య ఉండే వెద‌ర్‌కు చెందిన అప్‌డేట్‌ను ఐఎండీ ఇచ్చింది. ఏప్రిల్, జూన్ మ‌ధ్య కాలంలో దేశ‌వ్యాప్తంగా సాధార‌ణం క‌న్నా అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కానున్న‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ(IMD) తెలిపింది. సెంట్ర‌ల్‌, ప‌శ్చిమ ప్రాంతాల్లో ఆ హీట్ మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌నున్న‌ది. ప‌శ్చిమ హిమాల‌య ప్రాంతంలో మాత్రం సాధార‌ణం క‌న్నా త‌క్కువ స్థాయిలో ఉష్ణోగ్ర‌తలు నమోదు కానున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్ర‌త‌లు స్వ‌ల్పంగా ఉండ‌నున్నాయి. మైదాన ప్రాంతాల్లో ఏప్రిల్‌-జూన్ మ‌ధ్య కాలంలో సాధార‌ణం క‌న్నా ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కానున్న‌ట్లు ఐఎండీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు. ఈ రెండు నెల‌ల్లో దేశ‌వ్యాప్తంగా 10 నుంచి 20 రోజుల వ‌ర‌కు తీవ్ర‌మైన వేడి వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని, సాధార‌ణంగా 4 నుంచి 8 రోజుల మ‌ధ్య ఉండే ఆ స‌మ‌యం ఈ సారి పెర‌గ‌నున్న‌ట్లు ఐఎండీ తెలిపింది.హీట్‌వేవ్ ప్ర‌భావం ఎక్కువ‌గా గుజ‌రాత్‌, మ‌ధ్య మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర క‌ర్నాట‌క‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఒడిశా, ఉత్త‌ర చ‌త్తీస్‌ఘ‌డ్‌, ఆంధ్రాపై ఉండ‌నున్న‌ట్లు ఐఎండీ తెలిపింది.

ఏప్రిల్ నెల‌లో ఎక్కువ‌గా అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే ఛాన్సు ఉన్న‌ది. సెంట్ర‌ల్‌, సౌత్ ఇండియా ప్రాంతంలో ఇది ఎక్కువ‌గా ఉంటుంది. ఏప్రిల్‌లో గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌, ఒడిశా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఆంధ్రాలు హీట్‌వేవ్ ఉంటుంద‌ని ఐఎండీ అంచ‌నా వేసింది.