mallareddy
తెలంగాణ రాజకీయం

మల్లారెడ్డి ఆరోపణలను ఖండించిన మాజీ సర్పంచ్

మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పై గుండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్ సంచలన ఆరోపణలు చేశారు. తాను మాజీ మంత్రి మల్లారెడ్డిని డబ్బులు డిమాండ్ చేశానని  మల్లారెడ్డి చేసిన ఆరోపణలపై  ఈశ్వర్ స్పందించారు  తను డబ్బులు డిమాండ్ చేసినట్లు రుజువులు చూపెట్టాలని లేనిపక్షంలో  హైకోర్టులో 20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. బుధవారం గుండ్ల పోచంపల్లి మున్సిపల్ లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 2016,2017,2018 సంవత్సరంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రిల తో పాటు జిల్లా కలెక్టర్,ఉన్నత అధికారులతో మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో లో  32వేల మొక్కలను నాటడం జరిగిందన్నారు. ప్రస్తుతం అదే కళాశాలలో ఒక్క మొక్క కూడా లేదని మొక్కలు నాటిన స్థలంలో కళాశాల క్రీడా ప్రాంగణంగా మార్చారని ఆరోపించారు.

బి అర్ ఎస్ ప్రభుత్వం హరితహరంలో ఒక్క మొక్క సంరక్షించకపోయిన సర్పంచులు పదవి నుండి తొలగిస్తామని చెప్పారని అదే మాజీ మంత్రి మల్లారెడ్డి మొక్కలను తోలింగించినపుదు గత ప్రభుత్వం  మల్లారెడ్డి పై ఎందుకు చర్యలు తీసుకోలేదని  ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా మల్లారెడ్డి కళాశాల భవనాలు పూర్తిగా అక్రమ కట్టడాలని చెప్పారు. 2019 వ సంవత్సరంలో గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని 50 ఎకరాల భూమిని జీవో నెంబర్ 58 59 అడ్డం పెట్టుకొని ఐదు కోట్ల రూపాయలతో రెగ్యులరైజేషన్ చేసుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీ కళాశాల కూడా ఎలాంటి అనుమతులు లేవని గతంలో మల్లారెడ్డి యూనివర్సిటీ అనుమతుల కోసం 60 ఎకరాల లో కళాశాల ఉండాలని నిబంధనలు ఉన్నాయి కానీ ప్రస్తుతం ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీ 20 ఎకరాల్లోని ఉందని చెప్పారు. 2017 సంవత్సరంలో యూనివర్సిటీ పక్కన సర్వేనెంబర్ 650లో హెచ్ఎండిఏ లేఅవుట్ తన సర్పంచ్ గా ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చానని అదే లేఅవుట్ భూమి గా  చూపెట్టి పట్టా పాస్ బుక్ పొందిరని అన్నారు.మున్సిపల్ పరిధిలో సర్వేనెంబర్ 650లో  మాజీ మంత్రి మల్లారెడ్డి బావమరిది శ్రీనివాస్ రెడ్డి పేరు మీద తన అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని మేడ్చల్ ఎమ్మార్వో నుండి పట్టా పాస్ బుక్కులు పొందారని చెప్పారు.

అదే భూమిని మద్దుల శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డికి  గిఫ్ట్ డీడ్ కింద కేటాయించారని ఇప్పుడు ఆ స్థలాన్ని చూపించి మల్లారెడ్డి యూనివర్సిటీ కళాశాల అనుమతులు పొందాలని ప్రయత్నించారని చెప్పారు. దీనిపై తను మేడ్చల్ ఎమ్మార్వో కు  ఫిర్యాదు చేసి  ఆ డాక్యుమెంట్ను రద్దు చేయించినట్లు ఈశ్వర్ చెప్పారు. అంతేకాకుండా మైసమ్మగూడ లోని కళాశాల  రోడ్డు హెచ్ఎండి ఏ అధికారులు కూల్చివేస్తే ఇప్పటివరకు దానిపై మల్లారెడ్డి ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా మాజీ మంత్రి మల్లారెడ్డి అసత్య ఆరోపణ మానుకోవాలని ఈశ్వర్ హితవు పలికారు.