hyd-tempa
తెలంగాణ ముఖ్యాంశాలు

టెంపరేచర్ తో ఉక్కిరిబిక్కిరి

రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఉక్కిరి బిక్కరవుతున్నారు రాష్ట్ర ప్రజలు. పగటిపూట ఎండ తీవ్రతకు రాత్రిపూట ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇక మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దంటూ కూడా హెచ్చరికలను జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఐఎండి అధికారులు రాష్ట్రంలోని పలు జిల్లాలకు గుడ్ న్యూస్ అందించారురాష్ట్రంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఛత్తీస్గడ్ నుంచి నార్త్ తమిళనాడు వైపుగాఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి.. ప్రభావంతో ఆయా జిల్లాల్లో తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. రానున్న ఐదు రోజులపాటు ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడతాయి అని వాతావరణం శాఖ సూచించింది. ద్రోణి ప్రభావంతో అత్యధికంగా అసిఫాబాద్ జిల్లాలో 5.2మిల్లీమీటర్లు వర్షపాతం, కాగాజగిత్యాల జిల్లాలో 2.1మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు అయింది.

ఏప్రిల్ మొదటి వారంలో నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఇకహైదరాబాద్‎తో సహా దక్షిణ తెలంగాణలో పొడివాతావరణం, వడగాలులు కొనసాగనున్నాయి. భద్రాచలం 41డిగ్రీలు, ఖమ్మం 41డిగ్రీల, హైదరాబాద్ 40.7 డిగ్రీలు, రాజేంద్రనగర్ 40 డిగ్రీలు, పటాన్ చెరువు 40.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి అని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది