avinash-sharmila
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

వైసీపీలో వివేకానంద రెడ్డి కలవరం

కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి బస్సు యాత్రను జగన్ శిబిరం మొదట్లో చాలా తేలిగ్గా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పది సంవత్సరాల క్రితమే భూస్థాపితం జరిగింది. దాన్ని ఎవరు కూడా లేపలేరు ఏదో షర్మిల రెడ్డి పోటీ చేసిన ఫలితం ఉండకపోవచ్చు. దానివల్ల వైసీపీకి ఎలాంటి నష్టము లేదు. మొదట్లో వైసిపి పులితోలు కప్పుకున్న మేకపోతుల డాబు చూపించింది.

ఆ తరువాత అసలు విషయం బయటపడింది. షర్మిల డాక్టర్ సునీతలను చాలా తక్కువ అంచనా వేశారు. జిల్లాలో జరిగిన ఐదు రోజుల బస్సు యాత్ర వైసిపి నాయకుల్లో ముచ్చెమటలు పట్టించింది. ఎక్కడ ఎన్నికల్లో తమ పుట్టి ముంచు తుందేమోనన్న భయం ఆ పార్టీ నాయకుల్లో కలిగింది. వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేయించింది కడప పార్లమెంట్ సభ్యుడు ప్రస్తుతం వైసిపి ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి అంటూ షర్మిల సునీత బస్సు యాత్రలో పదే పదే చెప్పడం జగన్ శిబిరాన్ని కలవరపాటుకు గురిచేస్తుంది. ఇదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. కడప జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర మొట్టమొదట బద్వేలు నియోజకవర్గంలో మొదలైంది. ఆ తరువాత జిల్లా వ్యాప్తంగా ఐదు రోజులు పాటు సాగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మాజీ మంత్రి దివంగత వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత కాంగ్రెస్ పార్టీ మీడియా ప్రతినిధి డాక్టర్ తులసి రెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు బస్సు యాత్రలో పాల్గొన్నారు

కాలం ఎవరిని వదిలిపెట్టదు అంటారు. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం 2019 సార్వత్రిక ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య ఒక సంచలనం. టిడిపి వారే హత్య చేయించారని జగన్ శశిబిరం తీవ్ర విమర్శలు ఆరోపణలు చేసింది. సీన్ కట్ చేస్తే ఐదు సంవత్సరాలకు తిరిగి వచ్చిన ఎన్నికల్లో వివేకానంద రెడ్డి దారుణ హత్య ప్రధాన అస్త్రంగా మారి జగన్శి బిరాన్ని కలవరపాడుకు గురిచేస్తుంది. సిబిఐ విచారణలో వివేక హత్య కేసులో ఇంటిగుట్టు బహిరంగంగా బయటపడింది. ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి లను సిబిఐ నిందితులుగా చేర్చింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి ఎంపీ అవినాష్ రెడ్డికి మద్దతు పలుకుతుండగా ముఖ్యమంత్రి సోదరి షర్మిలారెడ్డి వివేకాను హత్య చేసిన వారిని
శిక్ష పడాలంటూ పోరాడుతున్న సునీతకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో కడప పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిలా రెడ్డి కడప జిల్లాలో చేపట్టిన ఐదు రోజుల బస్సు యాత్ర జగన్ శిబిరానికి చెమటలు పట్టించాయి.

ముఖ్యంగా షర్మిల సునీత బాణం లాంటి మాటలకు అవినాష్ రెడ్డి శిబిరం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా షర్మిలారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వివేక వర్ధంతి సందర్భంగా కడపలో చేపట్టిన ఆత్మీయ సమావేశానికి వచ్చా.రు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైనప్పుడు ఇడుపులపాయకు వచ్చి దివంగత వైయస్ కు నివాళులు అర్పించారు. కడప నుండి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ న్యాయయాత్రకు ఆమె శ్రీకారం చుట్టారు