tel-open school
తెలంగాణ ముఖ్యాంశాలు

ఏప్రిల్ 25 నుండి మే 2 వరకు నిర్వహించే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరిక్షలు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ  ద్వారా ఈ నెల 25 నుండి మే 2 వరకు నిర్వహించే పదవ తరగతి , ఇంటర్మీడియట్ పరిక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్  జితేష్ వి పాటిల్  అన్నారు.  సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షిస్తూ ఇటీవల నిర్వహించిన పదవ  తరగతి, ఇంటర్  పరీక్షల మాదిరే అందరు అధికారులు పకడ్బందీగా సమన్వయంతో పరీక్షలు నిర్వహించాలన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం 9.00 గంటల  నుండి 12 .00 గంటల వరకు, మధ్యాన్నం 2.30 గంటల నుండి సాయంత్రం  5.30 గంటల వరకు రెండు సెషన్ లలో పరీక్షలు జరుగుతాయని అన్నారు.  జిల్లాలో  పదవ తరగతికి సంబంధించి  923 మంది విద్యార్థులు , ఇంటర్మీడియట్ కు సంబంధించి 1,444 మంది  విద్యార్థులు  ఓపెన్ పరీక్షలు రాయనున్నారని అన్నారు. పదవ  తరగతి పరీక్షలకు  సంబంధించి (5)  పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అందులో  రెండు కేంద్రాలు బాన్సువాడ,  ఒక కేంద్రం యెల్లారెడ్డి , మరో రెండు కేంద్రాలు కామారెడ్డి లో  ఏర్పాటు చేశామన్నారు.

అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు (6) పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అందులో   బాన్సువాడ లో ఒకటి, ఎలారెడ్డి లో  రెండు కాగా మిగతా నాలుగు కేంద్రాలను కామారెడ్డి లో ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.  ఇంటర్మీడియట్ సైన్స్ కు సంబంధించి ప్రాక్టికల్స్ మే 3 నుండి 10 వరకు జరుగుతాయని  కలెక్టర్ తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని  అన్నారు. పరీక్షా కేంద్రాలలో  విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీరు, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు.    పోలీస్ బందోబస్తు తో ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు పంపిణీ చేయాలనీ,  కేంద్రాల వద్ద 144 సెక్షన్  అమలు చేయాలనీ, జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్.టి.సి. అధికారులు షెడ్యూల్ ప్రకారం బస్సులు నడపాలని, పరీక్ష నిర్వహణ అనంతరం సమాధానపత్రాలను సీల్ చేసి పోస్టల్ ద్వారా తరలించే ప్రక్రియ పకడ్భందిగా చెపట్టాలని ఆదేశించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించుటకు ఫ్లైయింగ్ స్క్వాడ్  బృందాలను, సిట్టింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.    

విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకోవాలని, మొబైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెస్ అనుమతి లేదని అన్నారు.  ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి రాజు,  ప్రభుత్వ పరీక్షల సహాయ కమీషనర్ నీల లింగం, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం,  డిపో మేనేజర్ ఇందిర,  తపాలా, పొలిసు, రెవిన్యూ, ఎలెక్ట్రిసిటి, వైద్య ఆరోగ్య శాఖల నుండి  ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.