తెలంగాణ ముఖ్యాంశాలు

హైడ్రా స్పీడ్ కు బ్రేక్ పడినట్టేనా

హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ రెస్సాన్స్‌ అంట్‌ అసెట్స్‌.. ఈ పద కొత్తగా అనిపిస్తుంది. కానీ, హైడ్రా అనగానే రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఈజీగా అర్థమవుతుంది. విశ్వనగరం హైదరాబాద్‌ను ఫ్యూచర్‌ సిటీగా మార్చలన్న సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారు. ఇందులో భాంగా నగరానికి ఎట్టుబడులు రావాలంటే ముందుగా వరదల నుంచి విముక్తి కల్పించాలని భావించారు. చిన్న పాటి వర్షం పడినా నరకాన్ని తలపిస్తున్న రోడ్లు.. కాలువలు, నదులను తలపిస్తున్న కాలనీల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి.. ఏళ్లుగా కబ్జా అవుతూ వస్తున్న చెరువలు, కుంటలను చెర విడిపించేందుకు హైడ్రా ఏర్పాటు చేశారు. దీనికి కమిషనర్‌గా ఐసీఎస్‌ రంగనాథ్‌ను నియించారు. గడిచిన నెల రోజుల్లో 200 ఎకరాలకుపైగా ఆక్రమణలను తొలగించింది. ఇర హైడ్రా దూకుడుకు కబ్జాదారులు గుండెల్లో రైళ్తు పరిగెత్తుతున్నాయి. ఎఫ్‌టీఎల్, బఫర్‌ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన వారు గజగజ వణుకుతున్నారు. హైడ్రా బుల్డోజర్‌ ఎప్పుడు తమ ఇంటి మీదికి వస్తుందో అన్న ఆందోళన చాలా మందిలో కనిపిస్తోంది. వేగంగా.. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా హైడ్రా తన పని తాను చేసుకుపోతంది.

ఈ నేపథ్యంలో హైడ్రా స్పీడ్‌కు బ్రేక్‌ వేసేందుకు తెర వెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు.హైడ్రాకు వ్యతిరేకంగా తాజాగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హైడ్రా ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 99 రద్దు చేయాలని కోర్టును కోరారు. విచారణ చేపట్టిన కోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ఈ పిటిషన్‌లో  జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ను కాదని హైడ్రాకు ఎలా అధికారాలు ఇస్తారని పిటిషనర్‌ ప్రశ్నించారు. హైడ్రాకు చట్టబద్ధత లేదని విన్నవించారు.ఇదిలా ఉంటే.. హైడ్రా స్పీడు తగ్గడం లేదు. ఆక్రమణల విషయంలో తన పని తాను చేసుకుంటూ పోతోంది. గడిచిన నెల రోజుల్లోనే 200 ఎకరాలకు పైగా ఆక్రమిత స్థలాన్ని విడిపించామని తెలిపింది. ఈ క్రమంలో వెయ్యికిపైగా నిర్మాణాలు కూల్చివేసినట్లు వెల్లడించింది. అయితే హైడ్రా దూకుడుతో చాలా మంది హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. కానీ, కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకోవాల్సిందే అని సమర్థిస్తుంది.

ముందుగా నోటీసులు ఇవ్వాలని పేర్కొంటుంది. అన్నీ పరిశీలించాకే కూల్చివేతలు చేపట్టాలని ఆదేశిస్తోంది. కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలు పెట్టి విల్లాలు కొన్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్డర్‌తో తమ డబ్బులు తమకు వెనక్కి ఇప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే మరో ప్రాంతంలో తమకు ఇళ్లు ఇప్పించాలని కోరుతున్నారు.