మండలంలో పదవ తరగతి పరీక్షలలో బాలికలు సత్తా చాటారు. మండలం మొత్తం బాలూరులు 304,బాలికలు 234,మొత్తం 530 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో బాలూరులు 88 మంది బాలికలు 126 మంది మొత్తం 214 మంది ఉత్తీర్ణత సాధించారు.ఇందులో ఫెయిల్ అయిన వాళ్ళు విద్యార్థిని విద్యార్థులు 324 కాగా ఇందులో కేజీబీవీ పాఠశాలకు చెందిన బాలికలు మొదటి స్థానంలో ఉండడం గమనార్హం.మండలంలో కేజీబీవీ పాఠశాలకు చెందిన బాలికలు 35 మంది పరీక్ష రాయగా 28 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఏడు మంది ఫెయిల్ అయినట్లు కేజీబీవీ ఎస్.ఓ తెలిపారు. ఇందులో ఆర్ ధరణి 564 మార్కులతో మొదటి స్థానం,ఎం.జయ శ్రీ 549 మార్కులతో రెండవ స్థానం,బి. అలేఖ్య 548 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు.ఇక నోవి ఇంగ్లీష్ మీడియం నుంచి బాలూరులు 12 మంది బాలికలు ఏడు మంది బాలురు మొత్తం 19 మంది పరీక్షలు రాయగా బాలురు 8 మంది,బాలికలు 6 మంది మొత్తం 14 మంది ఉత్తీర్ణత సాధించగా ఐదు మంది ఫెయిల్ అయినట్లు నోవి పాఠశాల యాజమాన్యం తెలిపింది.ఇక రాతన బాలికల ఆశ్రమ పాఠశాల నుంచి 27 మంది బాలికలు పరీక్ష రాయగా 18 మంది ఉత్తీర్ణత సాధించినట్లు 9 మంది ఫెయిల్ అయినట్లు తెలిపారు.
తుగ్గలి బాలుర ఆశ్రమ పాఠశాల నుండి 17 మంది పరీక్ష రాయగా ఎనిమిది మంది పాసైనట్లు 9 మంది ఫెయిల్ అయినట్లు తెలిపారు.ఇక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విషయానికొస్తే తుగ్గలి పాఠశాల నుండి 77 మంది బాలబాలికలు పరీక్షలు రాయగా 29 మంది పాస్ 48 మంది ఫెయిల్,రాతన పాఠశాల నుండి 21 మంది బాలబాలికలు పరీక్షలు రాయగా పదిమంది పాస్ 11 మంది ఫెయిల్,జొన్నగిరి పాఠశాల నుండి 135 బాలబాలికలు పరీక్షలు రాయగా 39 మంది పాస్ 96 మంది ఫెయిల్,పగిడిరాయి పాఠశాల నుండి 48 మంది బాలబాలికలు పరీక్షలు రాయగా 10 మంది పాస్ 38 మంది ఫెయిల్,ఆర్ఎస్ పెండేకల్ పాఠశాల నుండి 114 మంది బాలబాలికలు పరీక్ష రాయగా 34 మంది పాస్ 80 మంది ఫెయిల్,రామలింగాయ పల్లి పాఠశాల నుండి 29 మంది బాలబాలికల పరీక్ష రాయగా 16 మంది పాస్ 13 మంది ఫెయిల్, ఎద్దులదొడ్డి పాఠశాల నుండి 16 మంది పరీక్ష రాయగా ఐదు మంది పాస్ 11 మంది ఫెయిల్ అయినట్లు ఎంఈఓ రమా వెంకటేశ్వర్లు తెలియజేసారు.