తెలంగాణ రాజకీయం

మోడీ హయంలో ఉగ్రవాదం అంతమయింది

రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని గగన్ పహాడ్ వద్ద చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ప్రవాసీల తో చాయ్ పే చర్చా కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ పాల్గోన్నారు.
రాజస్థాన్ సీఎం మాట్లాడుతూ  2024 పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే అత్యంత ప్రతిష్టాత్మకమైనవి.  దేశ సమగ్రతకు పెద్దపీట వేస్తున్న నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావాలంటే తెలంగాణలో స్థిరపడ్డ రాజస్థానీ వాసులతో పాటు దేశ ప్రజలంతా కమలం గుర్తుకు ఓటు వేయాలి.  సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిని చేవెళ్ల నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిపించాలి.  నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక దేశంలో ఉగ్రవాదం అంతమయింది.  దేశ ప్రజలంతా సురక్షితంగా ఉంటున్నారు అంటే అది మోడీ ఘనత. 13వ తేదీన ప్రజలంతా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలిని అన్నారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ  పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తో చేవెళ్ల నియోజకవర్గం లో నా గెలుపు ఎప్పుడు నిర్ణయం అయిపోయింది. రెండు లక్షల ఓట్ల మెజార్టీతో చేవెళ్ల నుండి రెండోసారి ఎంపీగా విజయం సాధిస్తా.  పదేళ్ల నరేంద్ర మోడీ పాలనను చూసి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి నన్ను ఎంపీగా గెలిపించాలని అన్నారు.
రాజస్థాన్ ప్రభుత్వ చీఫ్ విప్ నారాయణలాల్ పంచారియా మాట్లాడుతూ  చేవెళ్ల నియోజకవర్గం నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందడం ఖాయం .  ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో చేవెళ్ల, హైదరాబాద్ స్థానం సహా మెజార్టీ ఎంపి స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం. రాజస్థాన్ లో 25 ఎంపీ స్థానాలకు 25 బీజేపీ గెలుచుకోవడం ఖాయమని అన్నారు.