హుస్నాబాద్ మున్సిపాలిటీ మొదటి వార్డు లోని కస్తుర్భా కాలనీ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొన్నం మాట్లాడుతూ కేబి కాలని లో ఇళ్లు లేని వారికి మొదట ఇళ్లు మంజూరు చేస్తాం. ప్రచారంలో ఇళ్లు చూసి బాధపడ్డ..దానిని అసెంబ్లీ లో మాట్లాడిన. గత ప్రభుత్వం హుస్నాబాద్ పట్టణంలో కేబీ కాలని ఇంట్లో నివసిస్తున్నారు చనిపోతే మాకు సంబంధం లేదని బోర్డు రాసిన ప్రభుత్వం అది. కేసిఆర్ తెలంగాణ లో 10 ఏళ్లు అధికారంలో ఉండి 2 వేల పెన్షన్ తప్ప ఏం చేశారు. డబుల్ బెడ్రూం ఇచ్చారా..? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారా..? దళిత బంధు వచ్చిందా..? ఉద్యోగాలు వచ్చాయా..? రుణమాఫీ చేయలేదని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతుంది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం. 500 కి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం..ఎవరికైనా రాకపోతే అధికారులకు చెప్పండి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మీకు కరెంట్ బిల్లు లేకుండా చేస్తున్నాం. 10 లక్షల ఆరోగ్య శ్రీ ఇస్తున్నాం.. ఎవరికైనా ఆరోగ్యం ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి….నేను చికిత్స చెపిస్త. ఎన్నికలు పూర్తికాగానే కొత్త పెన్షన్లు ఇస్తాం.. ఇప్పుడున్న పెన్షన్లు 4 వేలకు పెంచుతాం. రేషన్ కార్డులు ఇస్తాం.. గత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం..కేబీ కాలని కి ఇచ్చిన తరువాతనే వేరే వాళ్ళకి ఇళ్లు ఇస్తాం. మహా లక్ష్మి ద్వారా 2500 ఇస్తాం. బీజేపీ , బిఆర్ఎస్ లకు ఓటు వేసి వృదా చేసుకోవద్దు. మాకు ఓటు వేసి గెలిపించండి. నేను పేదల వర్గాల నుండి వచ్చిన..మీ సమస్యలు నాకు తెలుసని అన్నారు.