తెలంగాణ రాజకీయం

తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జూబ్లీహిల్స్లోని ఓబుల్రెడ్డి స్కూల్లో ఓటు వేశారు. సినీనటుడు ఎన్టీఆర్ ఇదే పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో కలిసి వచ్చి ఓటు వేశారు. జూబ్లీహిల్స్లో సినీనటుడు చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ మాదాపూర్లో, బర్కత్పురాలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఫిలింనగర్లో సినీనటుడు అల్లు అర్జున్, మలక్పేటలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి, మేడ్చల్ మండలం పూడూరులో భాజపా నేత ఈటల రాజేందర్, నానక్రామ్గూడలో నటుడు నరేష్, కుందన్బాగ్లో జయేశ్ రంజన్, జూబ్లీహిల్స్లో సినీ దర్శకుడు తేజ, తార్నాకలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.