తెలంగాణ రాజకీయం

ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటువేసేందుకు కుటుంబసభ్యులతో కొడంగల్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. జిల్లా పరిషత్‌ స్కూలులోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన అనంతరం స్థానికులతో మాట్లాడారు. ఈ సంరద్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ స్థానంలో తాము గెలవబోతున్నామన్నారు. సంక్షేమ పథకాలకు, ప్రభుత్వానికి ఈ ఎన్నికలు రెఫరెండం అని తెలిపారు.అనంతరం గ్రామస్థులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ పలు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.