తెలంగాణ ముఖ్యాంశాలు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎనిమిది గేట్లను అధికారులు గురువారం ఎత్తివేశారు. జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు 50వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ క్రమంలో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4,32,325 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులు ఉన్నది.