మాజీ మంత్రి హరీష్ రావుమతి లేని మాటలు మాట్లాడుతున్నారని పరిగి ఎమ్మేల్యే రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఎలా సోనియా గాంధీ నీ ఆహ్వానిస్తారు అని అంటున్నారు. కుటుంబ సమేతంగా సోనియా గాంధీ నివాసానికి వెళ్లి కాళ్ళు మొక్కి వచ్చారు. మీరు సోనియా గాంధీని ఏ హోదా లో ఆహ్వానిస్తారు అని మాట్లాడటం దారుణం అవివేకమన్నారు. సోనియా గాంధీ లేనిది తెలంగాణ రాలేదు. యువకుల ఆత్మహత్యలు చూసు.. ఇక్కడి బిడు బారిన ప్రాంతానికి నీళ్ళు.. నిధులు ఇవ్వాలని తెలంగాణ ఇచ్చారు సోనియా గాంధీ విమర్శలు చేయడం బాధాకరమన్నారు..రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి పోయారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువెళ్ళారు. మొదటి తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సోనియా గాంధీ నీ తెలంగాణ దేవతగా ప్రజానీకం హౌరవిస్తున్న సందర్భం రాష్ట్రం లో ఉంది.
భవిష్యత్ లో సోనియా గాంధీ గారిని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ వ్యతిరేకులకు విందు భోజనాలు ఏర్పాటు చేసినది మీరు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తులను మంత్రివర్గంలోకి తీసుకున్న ఘనత మీది. రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి, ఐటీఐఆర్ లకు రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభోత్సవం చేశారు. బీజేపీ వాళ్లు సుష్మా స్వరాజ్ గారు కూడా తెలంగాణ ఏర్పాటు విషయంలో సోనియా గాంధీ గారిని కొనియాడారు.మహేశ్వర్ రెడ్డి తన ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని,దానిలో భాగమే కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టకాల్చీ మీద వేస్తున్నారని దుయ్యబట్టారు.ఇప్పటి వరకు ధాన్యం సేకరణ ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. మహేశ్వర్ రెడ్డి కోటికి పైగా మెట్రిక్ టన్నులు అంటున్నారు.. ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్.గతంలో కేసిఆర్ వరి వేస్తే ఉరి అన్నారు.ప్రధాని ఇంటి ముందు వరి ధాన్యం కుమ్మరిస్తాం కొనుగోలు చేయకపోతే అని కేసిఆర్ చెప్పి.. కేంద్ర మంత్రులను కలవకుండా.. తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం రెండు గంటల వరకే దీక్ష విరమించారు.
రైతు వ్యతిరేక చట్టాలకు ఛార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లి BRS మద్దతు ఇచ్చింది.సన్న వడ్ల తో బోనస్ ప్రారంభించి.. దొడ్డు వడ్లకు కూడా కొనసాగిస్తాం.ఎక్కడ సీఎం, మంత్రులు దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమూ అని చెప్పలేదు.మహేశ్వర్ రెడ్డి దగ్గర ఆధారాలు కాదు.. ఎన్ని టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది అనే డాటా నే తప్పుగా ఉంది. ఇక ఆధారాలు ఎలా ఉంటాయో అర్ధం అవుతుంది.