దేశంలోకి నైరుతి రుతుపవనాలు) ముందే ప్రవేశించడంతోపాటు చాలా వేగంగా దేశం నలువైపులా విస్త రిస్తున్నాయి. వీటి ప్రభావం అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురవడంతోపాటు….వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత నెల 30న కేరళను తాకిన రుతుపవనాలు… కర్ణాటక( మీదుగా రాయలసీమలోకి ప్రవేశించాయి. ఈనెల 6న రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది.
ఏపీలోకి రుతుపవనాలు
కేరళలోకి ముందగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు….కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. చాలా రోజుల తర్వాత జూన్ 1, 2 తేదీల్లోనే రుతుపనాలు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభించడానికి రుతుపవనాలు రాక ఎంతో ఆవశ్యకం. రాయలసీమ జిల్లాల్లోకి ప్రవేశించిన రుతు పవనాలు క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలోనూ పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. ఈనెల 6న రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రాయలసీమలోకి రుతుపవనాల రాకతో తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆదివారం మొత్తం మబ్బులు పట్టి చిరుజల్లులు కురిశాయి. హైదారాబాద్‌లో అయితే భారీ వర్షమే కురిసింది.
తెలంగాణ జిల్లాల్లో ఈదురుగాలులు
నైరుతి రుతుపవనాల రాకను పురస్కరించుకుని తెలంగాణ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అసిఫాబాద్ జిల్లా వాంకిడిలో ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలో పిడుగుపడి చెట్లు నేలకూలాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.
మూడు రోజులు వర్షాలు
రాగల మూడురోజులపాటు తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉపరితల ఆవర్తన ప్రభావంతో నల్గొండ(, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డితోపాటు ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. యాద్రాద్రి భువనగిరి జిల్లా వీరవెల్లిలో ఈదురుగాలులకు పశువుల కొట్టం రేకులు ఎగిరిపోయాయి.బీఎస్ తిమ్మాపురంలో ఫొటో స్టూడియో రేకులు పడిపోయి కంప్యూటర్లు, ప్రింటర్, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. బాచుప్పలో కోళ్లఫాం కూలిపోయింది. మెదక్ జిల్లా వల్లంపట్లలో పిడుగు పాటుతో పాడిగేదె మృతిచెందింది. అలాగే అసిఫాబాద్ జిల్లాలోని గుండి పెద్దవాగులో వంతెన కొట్టుకుపోయింది. జన్నారంలో ఇంటి కప్పు లేచిపోగా…కిష్టంపేటలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. అలాగే పలుచోట్ల మేకలు పిడుగుపాటుకు చనిపోయాయి. హైదరాబాద్‌లోనూ పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి.
నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. ఆదివారం కేరళలోని మిగిలిన ప్రాంతాలకు విస్త రించడంతోపాటు తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు, కర్ణాటక, ఏపీలోకి ప్రవేశించాయి. రతుపవనాల రాకతోనే తొలకరి జల్లులు కురిసి…రైతులు సాగుకు సిద్ధమవుతుంటారు. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు దకిణ భారతదేంలో విస్తారంగా వర్షాలు కురిసేందుకు కారణమవుతాయి. వీటి రాకతో సకాలంలో వర్షాలు కురవడంతోపాటు….నదులు, రిజర్వాయర్లు నిండిపోతాయి. అందుకే రైతులు నైరుతి రుతుపవనాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. సకాలంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తన దుకాణాల వద్ద రద్దీ భారీగా పెరిగింది.