గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, కడప, కర్నూలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, మరో రెండు జిల్లాల జాయింట్ కలెక్టర్లు (రైతు భరోసా, రెవెన్యూ)తోపాటు పలువురు ఐఏఎస్ అధికారులను కూడా ట్రాన్స్‌ఫర్ చేసింది. వీరిలో కడప కలెక్టర్ చెవ్వూరి హరికిరణ్ మినహా మిగతా వారిని పలు పోస్టుల్లో నియమించింది. హరికిరణ్ మరో జిల్లాకు కలెక్టర్‌గా వెళ్లే అవకాశం ఉంది.
ఇక పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డిని విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమించగా, దేవాదాయశాఖ ప్రత్యేక కమిషనర్ పి.అర్జునరావును చేనేత, జౌళిశాఖ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. ఆయన పోస్టులో ఆ శాఖ ముఖ్యకార్యదర్శి పి.వాణీమోహన్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎం.ప్రభాకర్‌రెడ్డిని ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఎండీగా నియమించింది.