భారత విమానాల రాకపోకలపై నిషేధాన్ని పొడిగిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇవాళ నిర్ణయం తీసుకుంది. నిషేధాన్ని వచ్చే నెల 2వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఆ దేశ జాతీయ విమానాయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్ వేస్ తెలిపింది. పరిస్థితులకు అనుగుణంగా విమానాల రాకపోకల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని ఈ సంస్థ అధికారులు పేర్కొన్నారు.
కాగా, భారత్‌లో కరోనా డెల్టా వేరియంట్ ఉధృతి కారణంగా గత నెల కెనడా ప్రభుత్వం సైతం భారత ప్రయాణికుల విమానాల రాకపోకలపై మరో నెలపాటు నిషేధం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.