తెలంగాణ రాజకీయం

కేటీఆర్, హరీష్ రావు రాజీనామాలు సిద్దం చేసుకోవాలి

జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోండి. ఎక్కమొత్తంలో రైతు రుణమాఫీ చేస్తునం. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నస్టపోయిన రైతులకు కూడా నష్ట పరిహారం అందిస్తాం. దేశంలో ఎక్కడా లేని విధానం పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. వరికి మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ చెల్లిస్తాం. రాష్ట్రం లో కనుమరుగైన బి ఆర్ ఎస్ పార్టీ గురించి మేము మేము ఆలోచన చేయము. బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం అవకాశవడానికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉందని అన్నారు.
అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ ఆగస్ట్ 15 లోపల ఏక కాలంలో రెండు లక్షలు చెల్లించాలనే మంత్రి వర్గ నిర్ణయం తీసుకోవడం పై రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డీ కి కృతఙ్ఞతలు తెలిపారు. ధాన్యం సేకరణలో రైతుల వెంట ఉండి సేకరించాం. సీఎం రేవంత్ రెడ్డీ కి కృతజ్ఞతగా ప్రతి మండలంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించలి. కేటీఆర్, హరీష్ రావు రాజీనామ పత్రం పట్టుకొని సిద్దం గా ఉండాలని అన్నారు.