పామూరు మండలం, బొంపెద్దుపాడు నేరెళ్ళ వాగు వద్ద ఫెన్సింగ్ రాళ్ళ ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఫెన్సింగ్ రాళ్ళ క్రింద పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు ఉండేల చంద్ర ఓబుల్ రెడ్డి (38), సుంకేసుల పెద్ద హుస్సేన్ (45) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని జేసీబీ సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కాకిరేణిపల్లి నుంచి పామూరు మండలంలోని రజాసాహెబ్ పేట వద్దకు రాళ్ళు తరలించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా ట్రాక్టర్ డ్రైవర్ గుత్తి మస్తాన్ వలికి ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Related Articles
కడప టీడీపీ అభ్యర్ధిగా వివేకా భార్య
కడప జిల్లాలో పొలిటికల్ సీన్ మారుతోంది. ప్రధానంగా వైఎస్…
21న టీడీపీలోకి యార్లగడ్డ...
కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు…
వైసీపీలో సీట్ల టెన్షన్…
వైసీపీ ఇప్పటి నుంచే రానున్న ఎన్నికల మీద దృష్టి పెట్టినట్లు త…