సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట అర్బన్ రూరల్ నారాయణరావు పేట నంగునూరు… మండల జడ్పిటిసి ఎంపిటిసిల సన్మాన కార్యక్రమం లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ పదవికి విరమణ కానీ ప్రజాసేవకు కాదు. ఐదు సంవత్సరాలుగా ఎంతో కష్టపడుతూ ప్రజలకు సేవ చేసే భాగ్యం మీకు కలిగింది. మీ హయాంలో లో చరిత్ర లో నిలిచి పోయే పనులు ఎన్నో జరిగాయి. పదవిలో ఉన్నప్పుడు ఊరికి ఎంత బాగా పని చేశామనేది శాశ్వతంగా నిలిచిపోతుంది. ముందు ముందు మీకు మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అందరినీ కాపాడుకుంటాను, సముచిత స్థానం కల్పిస్తాను. పదవి ఉన్నా లేకపోయినా సమాన గౌరవం ఉంటుంది. మీ హయాంలో నె సాగు నీటి కల సాకారం అయింది. గ్రామాల్లో పచ్చటి చెట్ల తో స్వాగత తోరణలు స్వాగతం పలికేవి. నేడు చెత్త కుప్పలు స్వాగతం పలుకుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం లో కరెంట్ కష్టాలు. కాలిపోయినా మోటార్లు, ఇన్వెర్టర్స్ కాలం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం లో పరిపాలన మొద్దు నిద్ర లో ఉంది.
ప్రాధాన్యత లేని పాలన ఉంది. కొత్త ప్రభుత్వంలో ఇప్పటివరకు గ్రామపంచాయతీలకు ఒక రూపాయి నిధులు కూడా మంజూరు చేయలేదు. పంచాయతీ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు తమ సొంత డబ్బులతో గత ఆరు నెలలుగా పరిపాలన లాగుకొస్తున్నారు. ఇప్పుడు వారు కూడా చేతులెత్తేయడంతో కొన్ని గ్రామాలలో చెత్త సేకరణ, పారిశుధ్యం నిలిచిపోయింది. కాంగ్రెస్ కు ఓటు వేసిన పాపాన ఆత్మహత్య శరణ్యం అనే దుస్థితి లో రైతులు ఆందోళన లో ఉన్నారు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ప్రభాకర్ అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధకరమైన విషయం. బిఆర్ ఎస్ ప్రభుత్వం లో నమ్మకం. భరోసా ఉండే. 24 గంటల కరెంట్, కాలం తో పని లేకుండా కాళేశ్వరం నీళ్లు అందుతాయ్ పంట వేద్దాం అనే నమ్మకం రైతుల్లో ఉండే. పంట వేద్దాం అంటే నీళ్లు లేవు రావు అనే ఆందోళన లో రైతులు ఉన్నారని అన్నారు.
మరికొన్ని గ్రామాలలో గత 7 నెలలుగా గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు అందడం లేదు. రైతులకు దున్నకాలకు, వరి నాట్లకు, ఎరువులకు ఉపయోగపడేలా రైతు భరోసా డబ్బులు ఉండాలి. కానీ ఇప్పటివరకు రైతులకు రైతు భరోసా డబ్బులు రాలేదు. రైతుబంధు డబ్బులలో కోత విధించేందుకే కాలయాపన చేస్తున్నారు. కోత విధించిన సరే ఇచ్చే రైతు బందు ఇవ్వాలి కదా. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముచ్చట లేదు.
సర్కారు దావకానాల్లో మందులు లేక బయట మెడికల్ షాప్లకు చిట్టీలు రాస్తున్నారు. కెసిఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ బందు పెట్టిండ్రు. కాలం కాక, కాలేశ్వరం లో నీళ్లు నింపుతారో లేదో తెలియక రైతులు వరి నారు పోయలేదు గతంలో కేసీఆర్ మీద నమ్మకంతో మొగులు వైపు చూడకుండా వరి నారు పోసేవారు. పెన్షన్లు కూడా సరైన సమయంలో రావడం లేదు ఇప్పటికే రెండు నెలల పింఛన్ పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడు నెలలకే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు వచ్చే ప్రభుత్వం మనదే. ప్రతి ఒక్కరూ ప్రజలలో ఉండి సేవ చేస్తే మళ్లీ మీరే గెలిచి ఉన్నత పదవులు పొందే అవకాశం ఉందని అన్నారు. .