ఖమ్మం
కుక్కల దాడిలో కణుజు మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దరాంపురం సమీపంలో శుక్రవారం జరిగింది. అటవీ అధికారులు, కథనం ప్రకారం.. గుబ్బగుర్తి అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన కణుజును కుక్కలు వెంటాడి గాయపరచ డంతో మృతిచెందింది. స్థానికుల సమాచారంతో అటవీ సెక్షన్ అధికారి రామ సిబ్బంది పశువైద్యాధికారితో పోస్టుమార్టం చేయించారు. ట్రాక్టర్పై అటవీ ప్రాంతానికి తరలించి దహనం చేశారు.కాగా రాంపురం, లక్ష్మీపురానికి చెందిన వేటగాళ్లు విద్యుత్తు ఉచ్చులతో కణుజును చంపి ఉంటారని, అటుపై కుక్కలు దాడి చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కుక్కల దాడిలో కణుజు మృతి