వరంగల్, జూలై 27: ఎర్రబెల్లి దయాకరరావు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అయితే దయాకర్ రావు కొద్దిరోజుల క్రితం పార్టీ మారుతున్నట్లు పెద్ద ఎత్తిన ప్రచారం జరిగింది. అయితే పార్టీ మార్పు అంశాన్ని పక్కన పెడితే. ఎర్రబెల్లి బీఅర్ఎస్ పార్టీతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాస్ లీడర్ గా కొనసాగుతున్న నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. 30 సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయ నేతగా ఉన్న దయాకర్ రావు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. 2014 ఎన్నికల తరువాత దయాకర్ రావు బీ అర్ ఎస్ లో చేరి 2018 లో మంత్రి అయ్యారు. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దయాకర్ రావు ఎమ్మెల్యేగా ఓడిపోవడం, బీ అర్ ఎస్ అధికారానికి దూరం కావడం జరిగింది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పార్టీ వీడుతున్నారు. అదే దారిలో నెల రోజుల క్రితమే దయాకర్ రావు కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే పార్టీ మారడం పై బ్రేక్ పడింది. దీంతో ఎర్రబెల్లి ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. పార్టీ మారుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం కావడం టిఆర్ఎస్ అధినేత ఆ పార్టీ నేతలు సైతం దయాకర్ రావు పార్టీ మారడం ఖాయమని డిసైడ్ అయ్యారు. దయాకర్ రావు పార్టీ మారే అంశంకు ఒకసారి బ్రేక్ పడడంతో ఆయన బీఆర్ఎస్ లో ఉండలేక పార్టీ మారలేక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఎర్రబెల్లి కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలతో పాటు పార్టీ నేతలతో పెద్దగా టచ్ లో ఉండడం లేదట. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విమర్శలు చేస్తున్న నేపథ్యంతో కేటీఆర్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. వరంగల్ జిల్లాలో కీలక నేతగా ఉన్న దయాకర్ రావు కాళేశ్వరం టూర్ కు దూరంగా ఉన్నారు. అయితే దయాకర్ రావు అందుబాటులో లేకుంటే కాళేశ్వరం సందర్శనకు వెళ్లలేదు అనుకోవచ్చు. కానీ ఎర్రబెల్లి హైదరాబాద్ లో ఉంది కూడా పార్టీ చేపట్టిన కార్యక్రమానికి వెళ్ళాక పోవడంతో పెద్ద చర్చ జరుగుతుంది. దీంతో దయాకర్ రావు పార్టీకి దూరంగా ఉంటున్నారనే అనుమానాలకు బలం చేకూరుతుంది.దయాకర్ రావు పార్టీ కార్యక్రమాలకు అంటెండ్ కాకపోవడంతో పాటు నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ నేతలతో సమావేశం కావడం, మాట్లాడడంతో పాటు పార్టీ లైన్ లో వెళ్లాల్సి వస్తుందని ఉద్దేశంతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. ఒకవేళ వరంగల్ నగరానికి వచ్చిన పార్టీ నేతలతో మాట్లాడడం కలవడం లేదట. రావడం స్వంత పనులు చూసుకొని వెళ్ళడం తప్ప పార్టీ కోసం పనిచేయడం లేదనే చర్చ జరుగుతుంది. ఎర్రబెల్లి పార్టీ మారడం ఖాయమని పార్టీ భావిస్తుందడంతో ఆ పార్టీ నేతలు కూడా ఎర్రబెల్లి పట్టించుకోవడం లేదనే చర్చ లేకపోలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు అటు పార్టీ మారలేక ఇటు సొంత పార్టీలో ఉండలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది.
Related Articles
రేవంత్‌రెడ్డి సహా మరికొందరు నేతల గృహ నిర్బంధం
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email నేడు విద్యుత్ సౌధ, సివిల్ సప్లైస్ భవనాల ముట్టడికి రేవంత్‌రెడ్డి పిలుపు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విద్యుత్ చార్జీల పెంపు, ధాన్యం కొనుగోలు పోరాటంలో భాగంగా నేడు విద్యుత్ సౌధ, సివిల్ సప్లైస్ భవనాల ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ […]
కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం – గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింఘ్ వాఘేలా
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email వర్తమాన జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమున్నదని గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింఘ్ వాఘేలా అన్నారు. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్దమవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలను […]
బాలింత, శిశువుకు రోడ్డుపైనే వైద్యం చేసిన వైద్యులు
భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణం రామవరం మాతా శిశు ఆసుపత్రికి బాలింత ఆటోలో రోజుల శిశువు తో వెళ్లింది. కొత్తగూడెం లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా మాతా శిశు ఆసుపత్రికి వెళ్లే దారి భారీ వరద కారణంగా ఆసుపత…