తెలంగాణ

బాలింత, శిశువుకు రోడ్డుపైనే వైద్యం చేసిన వైద్యులు

భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణం రామవరం మాతా శిశు ఆసుపత్రికి బాలింత ఆటోలో రోజుల శిశువు తో వెళ్లింది. కొత్తగూడెం లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా మాతా శిశు ఆసుపత్రికి వెళ్లే దారి భారీ వరద కారణంగా ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆసుపత్రి ఆర్ ఎం ఓ వీరబాబు ఆటో దగ్గరకు వెళ్లి వర్షంలోనే తల్లి బిడ్డకు వైద్యం చేశారు. కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మాతా శిశు ఆసుపత్రికి అత్యవసర పరిస్థితుల్లో భారీ వర్షం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బాలింతలు, గర్భిణీ లు, శిశువు లు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితి నెలకొంటే ఏంటి పరిస్థితి అని బాధితులు ఆగ్రహిస్తున్నారు. భారీ వర్షాల నేపద్యంలో ఆసుపత్రి వర్గాలు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.