తెలంగాణ

శ్రీశైలం మల్లన్నసేవలో  మంత్రి వాసంశెట్టి సుభాష్

శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు ఆలయ మర్యాదలనుసరించి ఆలయ ఈవో పెద్దిరాజు, ఏఈఓ శ్రీనివాసులు అర్చకులు,ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు అనంతరం శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జునస్వామికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆలయ అర్చకులు,వేదపండితులు వేద ఆశీర్వచనం చెయ్యగా ఆలయ ఈవో పెద్దిరాజు శ్రీస్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు,శేషవస్త్రాలు శ్రీస్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు……