ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

చిన్నారుల కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

పెందుర్తి: పెందుర్తి లో చిన్నారుల కిడ్నాప్ కేసును పోలీసులు చేదించారు..  కిడ్నాపర్ ను అదుపు లో తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఒడిస్సా గంజాం జిల్లా, కాళికట్ ప్రాంతానికి చెందిన మినతి ప్రధాన్ పిల్లలతో పెందుర్తి నియోజకవర్గం, నరవలో కూలి పనులు చేసుకుంటూ నివాసం ఉంటోంది..అదే రాష్ట్రనికి చెందిన ముద్దాయి వాసుదేవ జెల్లీ కూడా నరవలో ఉంటూ కూలీపనులు చేసుకుంటున్నాడు.. తల్లి మినతి ప్రధాన్ కు ఒక సోదరి ఉంది.. కొద్దిపాటి పరిచయంతో నిందితుడు ఆమె సోదరిని తనకు ఇచ్చి వివాహం చెయ్యమని కోరాడు.. అందుకు ఆమె నిరాకరించడంతో ఈ నెల 18 న మినతి ప్రధాన్ పిల్లలు ఇద్దరినీ కిడ్నాప్ చేసి తరలించుకుపోయాడు.. తల్లి అదే రోజు సాయంత్రం కూలి పని తరువాత  ఇంటికి వొచ్చి చూసేసరికి ఇద్దరు పిల్లలు కనపడక పోయేసరికి ఒడిస్సా కు వెళ్లి అక్కడ కళ్లికోట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.. వెంటనే అక్కడ పోలీసులు జీరో ఎఫ్. ఐ. అర్. నమోదు చేసి పెందుర్తి పోలీసులకు కేసును బదళాయించారు.. ఇక్కడ పోలీసులు కేసు నమోదు చేసి, ఈ నెల 22 న ఎస్. ఐ. సింహాచలం, ఇతర బృందాలను ఒడిస్సా కు పంపారు.. నిందితుడు ఒక్క ఫోన్ కాల్ అదారంగా కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకొని, పెందుర్తికి తరలించారు.. పిల్లలను తల్లికి అప్పాజెప్పారు పోలీసులు.. ఈ కేసును చేదించిన పెందుర్తి సి. ఐ, ఎస్. ఐ. సింహాచలం వారి బృందాన్ని  నగర సి. పి. అభినందించారు..