బద్వేలు: రాయచోటి స్థానిక పెట్రోల్ బంక్ వద్ద మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి గజమాలవేసి ఘన నివాళులు అర్పించిన రాయచోటి మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి సోదరుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాహుల్ రాహుల్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం గారిని మనం ఒక మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా ఆయనను ఎలా చూసినా దేశానికి గొప్పఆదర్శ నాయకుడు. 1998 భారత దేశపు అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక రాజకీయ పాత్ర పోషించారు. 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రాణాలికలు సూచించారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత్ రత్నాతో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. అలాంటి మహనీయుడు అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అతావుల్లా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
అబ్దుల్ కలాం యువతకు స్ఫూర్తి: చమర్తి
భారతదేశానికి తొలి మిస్సైల్ పరిచయం చేసిన మాజీ రాష్ట్రపతి వర్యులు,స్వర్గీయ అబ్దుల్ కలాం ప్రపంచ పటంలో భారతదేశాన్ని మిషెల్ పరిజ్ఞానంలో మొదటి వరుసలో ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారేనని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు ఈసందర్భంగా తెలియజేశారు.9వ వర్ధంతి సందర్భంగా తన క్యాంపు కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులుఅర్పించారు.ఈసందర్భంగా జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అతి తక్కువ ధరకే స్టంట్ ను పరిచయం చేసిన గొప్ప మహనీయుడు అబ్దుల్ కలాం అనికొనియాడారు.అదేవిధంగా విద్యార్థుల్లో ఉన్న మేధోశక్తిని పెంపొందించడానికి భారతదేశంలోని అత్యంత విద్యావంతులు విద్యను అభ్యసించే ఐఐటి త్రిబుల్ ఐటీ మొదలగు భారత దేశ విద్యాసంస్థలలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సెమినార్స్ ఏర్పాటు చేయించి తద్వారా వారి నైపుణ్యాభివృద్ధికి తోడ్పడే వారన్నారు.ఇటువంటి మహనీయుడు,గొప్ప మేధోశక్తి కలిగిన అబ్దుల్ కలాం గారిని చంద్రబాబు సారథ్యంలో మైనారిటీ వర్గానికి చెందిన ఒక శాస్త్రవేత్తను భారతదేశానికి రాష్ట్రపతిగా ప్రతిపాదించారని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈకార్యక్రమంలో రోడ్డు రవాణా రాష్ట్ర మాజీ డైరెక్టర్ గుల్జార్ భాష, పార్లమెంట్ కార్య నిర్వాహక కార్యదర్శి కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు,పట్టణ అధ్యక్షులు దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు,మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్కే కరీమ్,మాజీ కౌన్సిలర్ జీలాని భాష, సీనియర్ నాయకులు తుపాకుల బాషా,తదితరులు పాల్గొన్నారు.