bashyam school
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

భాష్యం స్కూల్ పై చర్యలు తీసుకోవాలి…

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు భాష్యం స్కూల్లో అడ్మిషన్ లేకపోయినా క్లాసులు చెబుతూ వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూన్నా భాష్యం స్కూల్ పై చర్య తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప, పట్టణ కార్యదర్శి విజయ్ మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు గారికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరులో ఉన్నటువంటి భాష్యం స్కూల్లో విచ్చలవిడిగా అక్రమంగా అడ్మిషన్ లేకపోయినా విద్యార్థుల విద్యార్థుల్ని పాఠశాలల్లో చేర్చుకుంటూ వాళ్లకు మెరుగైన క్లాసులు చెబుతున్నామని తల్లిదండ్రుల దగ్గర  ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలను వదిలేస్తున్నారని మండిపడ్డారు విద్యార్థుల టీసులు మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయి కానీ క్లాసులు మాత్రం భాష్యంలో జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు ఎంత మాత్రం తమ విధులను నిర్వహిస్తున్నారో  అర్థమవుతుందని వారు అన్నారు. ఇలా అక్రమంగా క్లాసులు చెబుతూ ఫీజులు వసూలు చేస్తున్న భాష్యంపై తక్షణమే విచారణ జరిపి ఇలాంటివి మళ్లీ ఎక్కడ జరగకుండా భాష్యం స్కూలు ను సీజ్ చేయాలన్నారు.

అలాగే వీళ్ళకి సహకరిస్తూ ప్రభుత్వ పాఠశాలలలో నుండి విద్యార్థులను పంపుతున్నా ప్రధానోపాధ్యాయులపై కూడా శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు నితీష్ , ఆనంద్ ప్రమోద్ మోహన్ బన్నీ తదితరులు పాల్గొన్నారు.