ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

పడవ ప్రమాదం దురదృష్టకరంపి.గన్నవరం

పి. గన్నవరం: పి. గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక గ్రామంలో గోదావరి నదిపై పడవ బోల్తా ఘటన దురదృష్టకరమని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఆయన పడవ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తో కలిసి పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూGB ఊడిమూడి లంక వద్ద పడవ ఎప్పుడూ వెళ్లే దారిలో కాకుండా దగ్గరగా ఉండే దారిలో వెళ్లడం వలన ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించామన్నారు. ప్రమాదంలో గల్లంతయిన విజయ్ కుమార్ అనే వ్యక్తి లైఫ్ జాకెట్ సరిగ్గా ధరించకపోవడం వలన గల్లంతయినట్లు తెలిపారు. విజయ్ కుమార్ గల్లంతయాడని తెలుసుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయిందని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారని తెలిపారు. విజయ్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.పి. గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక గ్రామంలో గోదావరి నదిపై పడవ బోల్తా ఘటన దురదృష్టకరమని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఆయన పడవ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తో కలిసి పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఊడిమూడి లంక వద్ద పడవ ఎప్పుడూ వెళ్లే దారిలో కాకుండా దగ్గరగా ఉండే దారిలో వెళ్లడం వలన ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించామన్నారు. ప్రమాదంలో గల్లంతయిన విజయ్ కుమార్ అనే వ్యక్తి లైఫ్ జాకెట్ సరిగ్గా ధరించకపోవడం వలన గల్లంతయినట్లు తెలిపారు. విజయ్ కుమార్ గల్లంతయాడని తెలుసుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయిందని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారని తెలిపారు. విజయ్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.