తెలంగాణ

అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన కాప్రా తాసిల్దార్

మేడ్చల్: జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ చెరువు కు సంబంధించిన ఎఫ్టిఎల్ ల్యాండ్  కబ్జాకు గురవుతుందని స్థానికులు సమాచారం అందించడంతో,  చెరువు వద్దకు  కాప్రా తాసిల్దార్ సుచరిత వెళ్లారు. చెరువు ను పరిశీలించిన తరువాత  అక్రమంగా నిర్మించిన మూడు  నిర్మాణాలను తొలగించారు.మరొక అక్రమ నిర్మాణం ఉండగా అందులో ఓ కుటుంబం నివాసం ఉంటున్నారు, వారికి ఒకరోజు టైం ఇచ్చి రేపటిలోగా కాళి చేయాలని ఆదేశించారు.ప్రభుత్వ భూములలో కానీ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఎలాంటి అక్రమ నిర్మాణలు చేపట్టినా సహించేది లేదని ఎంతటి వారిపై అయినా క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాప్రా తాసిల్దార్ హెచ్చరించారు.