తెలంగాణ

గురువారం కందుకూరు లో సీఎం రేవంత్ పర్యటన

మహేశ్వరం: ఆగస్టు ఒకటో తేదీన కందుకూరు లో స్కిల్ యూనివర్సిటీ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నట్టు మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి తెలిపారు.
 తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గనీ మహానగరంగా తీర్చిదిద్దబోతున్నామని లక్ష్మారెడ్డి తెలిపారు. నియోజకవర్గం లోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని అన్నారు. నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఆయా రంగాలలో త్వరగా పొందడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలో కళాశాలలో,మెడికల్,ఎంటర్టైన్మెంట్ హాబ్స్,వివిధ సంస్థల కంపెనీలు వేర్పాటే లక్ష్యంగా పనిచేస్తానని లక్ష్మారెడ్డి తెలిపారు.