రంగారెడ్డి: బండ్లగూడ జాగీర్ ఓం నగర్ కాలనీ లోని ఓ ఇంటి పై భారీ క్రేన్ విరిగి పడింది. ఆదే సమయంలో ఆ ఇంటి మిద్దె పై చంటి బిడ్డ తో వివాహిత వాకింగ్ చేస్తోంది. పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఘటనతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైన మహళ కిందకు పరుగులు తీసింది. భారీ శబ్దానికి ఇంటి నుండి కాలనీ వాసులు బయటకు పరుగులు తీసారు. కాలనీ వాసులు వివాహిత ఇంటి వద్దకు చేరుకున్నారు.
బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్పోరేషన్ ఓం నగర్ కాలనీ లో బహుళ అంతస్తుల భవనంకొనసాగుతున్నాయి. 24 గంటలు నిర్విరామంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కంస్ట్రష్కన్ ఇంచార్జ్ పై దాడికి కాలనీ వాసులు ప్రయత్నించారు. రంగ ప్రవేశం చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దాడిని అడ్డుకున్నారు. తృటి లో ప్రాణాలతో నా బిడ్డ తో బయట పడ్డాం. బహుళ అంతస్తుల భవనం మొదలైనప్పటి నుండి పలు సమస్యలు. అధికారులకు లంచాలు ఇచ్చి 24 గంటలు పనులు కొనసాగిస్తున్నారని బాధితులు ఆరోపించారు. బహుళ అంతస్తుల భవనం ముందు నిరసనకు దిగారు.