తెలంగాణ ముఖ్యాంశాలు

జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

నాసెన్స్ రసాయన పరిశ్రమలో ప్రమాదం

హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాసెన్స్ రసాయన పరిశ్రమలో ఈ ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలోని రసాయనాలకు మంటలు అంటుకోవడంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాయిలర్లలో ఇంకా పేలుళ్లు సంభవిస్తున్నాయి. దీంతో పరిశ్రమ పరిసర ప్రాంతంలో పొగలు దట్టంగా అలముకున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.