తెలంగాణ

పార్టీ మారడం లేదుఎమ్మెల్యే తెల్లం

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు టిఆర్ఎస్ గూటికి చేరుతున్నాడంటూ వచ్చిన కథనాలపై సోషల్ మీడియా వేదికగా అయన కౌంటర్ ఇచ్చారు.
నేను బీఆర్ఎస్ లో చేరుతున్నానని వచ్చే అపవాదులు కేవలం నాపై బురద చల్లడానికి మాత్రమేనని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రుల ఆశీస్సులతో నేను భద్రాచలం ప్రజలకు సేవ చేసుకుంటున్నాను. రాజకీయ భవిష్యత్తు ఆలోచించే ఏ వ్యక్తి ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోడు. భద్రాచలం మరియు ప్రజల అభివృద్ధి కోసమే నేను పాటుపడతాను తప్ప స్వలాభాల కోసం కాదని అయన అన్నారు.