తిరుపతి: తిరుమల మార్గ మధ్యలో మరచిపోయిన విలువైన బంగారు వస్తువులు, నగదు బ్యాగ్ ను డ్రైవర్ నిజాయితీలో అప్పగించాడు. విశాఖపట్నం జిల్లా పార్వతీపురం గ్రామం యాత్రికుడు గోపాలకృష్ణ బ్యాగులో రూ.1.50 లక్షల నగదు, రూ.8.40 లక్షల విలువైన బంగారు, 201 యూఎస్ డాలర్లు వున్నాయి. వాటిని జీపులో మరచిపోయాడు. ఆ బ్యాగ్ ను డ్రైవర్ భూపతినాయుడు పోలీసులకు అప్పగించాడు.
నిజాయితీగా విలువైన బ్యాగ్ ను అప్పగించిన భూపతినాయుడు ను ఆగష్టు 15న సన్మానించేందుకు సిఫార్సు చేస్తామని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. డ్రైవర్ భూపతి నాయుడును జీపు, ఆటో డ్రైవర్ లు ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ అన్నారు. నిజాయితీగా వ్యవహరించిన డ్రైవర్ భూపతి నాయుడును శాలువ తో సత్కరించారు.