తెలంగాణ

రేవంత్ రెడ్డి,బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనం

రంగారెడ్డి: సబితా ఇంద్రారెడ్డి కి సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. బడంగ్ పేట్ చౌరస్తా లో రేవంత్ రెడ్డి,బట్టి విక్రమార్క దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా అని చూడకుండా అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ని అవమానపరిచే విధంగా మాట్లాడడని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.  బడంగ్ పేట్ చౌరస్తాలో ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మహిళలు అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేకుండా పోయిందని రామిడి రామిరెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నందుకే టార్గెట్ చేశారని రామ్ రెడ్డి అన్నారు. సబితా ఇంద్రారెడ్డి అవమానపరిచే విధంగా ఇకపై మాట్లాడితే సాహించేది లేదని హెచ్చరించారు.