తెలంగాణ

సుప్రీం తీర్పు సమ న్యాయం..సమ ధర్మంమంత్రి దామోదర రాజనర్సింహc

హైదరాబాద్: సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీ కరణకు అనుకూలంగా జడ్జి మెంట్ ఇవ్వటం స్వాగతిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి ఆరుగురు ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి అడ్వకేట్ ను నియమించారు.రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. తీర్పు సమ న్యాయం, సమ ధర్మం. అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని పోరాటం జరిగింది. న్యాయం ధర్మం గెలిచింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నాను. తీర్పు ఒక వర్గానికి వ్యతిరేకం కాదు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి అమరులు అయ్యారు. అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.