మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,15,72,344
మృతుల సంఖ్య మొత్తం 4,23,217
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,230 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే, 24 గంటల్లో 42,360 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,15,72,344కు చేరింది.
మరణాల విషయానికొస్తే… నిన్న 555 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,23,217కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,07,43,972 మంది కోలుకున్నారు. 4,05,155 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 45,60,33,754 వ్యాక్సిన్ డోసులు వేశారు.