ఆంధ్రప్రదేశ్

 ఉయ్యూరు సోమేశ్వరాలయం  సోమ్ములు స్వాహా 2019 నుండి షుమారు 8.30కోట్ల  రుపాయల వడ్డీలు గోల్ మాల్ గతంలో కోండాలమ్మ గుడిలోను  సోమ్ములు కైంకర్యం 

విజయవాడ, ఆగస్టు 1: ఉయ్యూరు సోమేశ్వశ్వాలయానికి భూసేకరణ నిమిత్తం వచ్చిన డిపాజిట్ 8లక్షల 30లక్షల రుపాయలు వడ్డీల 6.85శాతం సోమ్ములలో 1/3 శాతం మాత్రమే వాడుకోని మిగిన సోమ్ములు డిపాజిట్ చేయవలసీ ఉంది.కాని అందుకు విరుద్దంగా సోమ్ములు జమ కాకండ పోన్నాయని విశ్వసనీయ సమాచారం.సోమేశ్వరాలయానికి సంబందించి భూసేకరణ నిమిత్తం 2018 వ సంవత్సరం లో 8కోట్ల 30 లక్షల రుపాయలు రుపాయలు బ్యాంక్ లో డిపాజిట్ అయ్యాయి. దేవాదాయ శాఖ విధి విధానాల ప్రకారం 8కోట్ల 30 లక్షల రుపాయలను డిపాజిట్ చేయవలసి ఉంది.డిపాజిట్ ద్వారా  వచ్చిన వడ్డి 4లక్షల 73 వేల రుపాయలు వస్తున్నాయి.వచ్చిన వడ్డిలో  అనగా 4 లక్షల 73వేల రుపాయలలో 1/3 మాత్రమే అనగా షుమారు 1లక్షా 50 వేల రుపాయలు ఖర్చు చేయవలసి ఉంది.2019 ఆక్టోబర్ వరకు నిధులు జమ చేసినట్లు తెలుస్తుంది కాని తరువాత నుండి బ్యాంకు జమ చేయవలసిన షుమారు 3 లక్షల 30వేల రుపాయలు దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్దంగా ఏటువెళ్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది.ఈ వడ్డీలను జమ చేయని అధికారి గతంలోను కొండలమ్మ గుడి వ్యవహరంలోను అక్కడ అర్చకులకే శఠగోపం పెట్టారని ఆయన గురువు “విజయా”శీస్సులతో బయట పడ్డారని వినికిడి.నియమాలకు విరుద్దంగా షుమారు నెలకు 3లక్షల 30వేల రుపాయలను పక్క దారి పట్ఞించిన వారిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.