ఆంధ్రప్రదేశ్

మట్టి మీద మిద్దె  కూలిపోయి నలుగురు మృతి

నంద్యాల: చాగలమర్రి మండలం చిన్న వంగలి  గ్రామం నందు పాత మట్టి మిద్దె గురువారం అర్ధరాత్రి కూలి పడి ఇంటిలో నిద్రిస్తున్న నలుగురు మృతి చెందడం జరిగింది. మరణించిన వారిలో  గురు శేఖర్ రెడ్డి(45), దస్తగిరమ్మ (38), ఇద్దరు కుమార్తెలు  పవిత్ర(16), గురు లక్ష్మి (8) మరణించడం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గమనించిన స్థానికులు హుటా హుటినా శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. ఒకే కుటుంబంలో ఒకేసారి నలుగురు  మృతి చెందడంతో  విషాదఛాయలు అలుము కున్నాయి. తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా వారిలో రెండవ అమ్మాయి ప్రసన్న   పొద్దుటూరు ఉషోదయ పాఠశాలలో విద్యనభ్యసిస్తుంది. ఆళ్లగడ్డ సీఐ హనుమంత నాయక్, ఎస్ఐ రమణయ్య  జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని  మరణించిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగింది.