ఆంధ్రప్రదేశ్

 పోస్టల్ గోల్ మాల్

ప్రకాశం: టంగుటూరు మండలం అనంతవరం గ్రామంలో తపాల శాఖలో నగదు గోల్ మాల్ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వృద్ధులు, మహిళలు, పొదుపు చేసే ఇతర ప్రజలు నుండి నగదు కట్టించుకుని వాటిని సొంతానికి వాడుకున్న అక్కడ ఎబిపిఎంగా పనిచేసే కొమ్ము సుందర్ సింగ్, బిపిఎంగా పని చేసే సాయిశ్రీనివాస్ నాయక్. అనేక రకాల పొదుపు ఖాతాల ద్వారా నగదు కట్టించుకుని వాటిని పోస్ట్ ఆఫీసులో జమ చేయకుండా సుమారు 12 లక్షల వరకు చేతివాటం ప్రదర్శించారు. అయితే కొంతమంది ఖాతాదారుల ఖాతా మెచ్యూరిటీ అయినప్పటికీ నగదు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి పోస్ట్ ఆఫీస్ వద్ద విచారించారు. దీంతో సాయి శ్రీనివాస్ నాయక్, సుందర్ సింగ్ చేసిన మోసం బయటపడింది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పోస్టల్ సౌత్ సబ్ డివిజన్ అధికారి  కరవికుమార్ రెడ్డి, సూపర్వైజర్ రవికుమార్  విచారణ చేసి తగు అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు న్యాయం చేస్తాం హామీ ఇచ్చారు.