ఆంధ్రప్రదేశ్

 కోనసీమ లో పేక్ నోట్లు చలామణి..ప్రతీ నోటు సరి చూసి తీసుకోండి..బ్యాంక్ సిబ్బంది సూచన..

కోనసీమ: కోనసీమ లో పలు ప్రాంతాల్లో  ఫేక్ నోట్లు చలామణి అవుతున్నాయి. ఒరిజినల్ నోట్ల లాగే ఉండటంతో చాలా మంది మోసపోతున్నారు. ఎప్పుడైనా బ్యాంకుకు వెళ్ళి నగదు జమ చేస్తుంటే ఫేక్ నోట్లు బయట పడుతున్నాయి. దీంతో చాలా మంది నష్టపోతున్నారు. ఎక్కువగా 500 మరియు 100, 200  ఫేక్ నోట్లు చలామణి అవుతున్నాయని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. కొత్తపేట, మండపేట, రామచంద్రపురం, రావులపాలెం,అమలాపురం తదితర గ్రామాల్లో 100,200,500 రూపాయల కట్టల్లో కనీసం ఒక నోటు వస్తుందని చెప్పారు.నోట్లు సరి చూసి తీసుకోవాలని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు.