తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం కొత్తూరు ఆరుగొలను గ్రామాల ఆయకట్టు వర్షపు నీటితో నేటికీ ముంపులో ఉందని ఏలూరు కాలువ నీటిమట్టం తగ్గించాలని ఇరిగేషన్ ఎస్సీ ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద గురువారం నవాబుపాలెం సర్పంచ్ మద్దుకూరి ధనరాజు, కృష్ణయ్యపాలెం సర్పంచ్ బేతపూడి వెంకటేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షుడు అడపా ప్రసాదులతో కలిసి రైతులు వారి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అవతల గట్టున రైల్వే ట్రాక్, ఇవతల ఏలూరు కెనాల్ నీటిమట్టం ఎక్కువగా ఉండటం వల్ల వర్షపు నీరు చేలలోంచి బయటకు వెళ్లడం లేదని దీనివల్ల 20 రోజులుగా పంట నీటిమనక లోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ వెంటనే ఏలూరు కాలువ నీటిమట్టం తగ్గించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఎప్పుడు వర్షాలు కురిసిన ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందని దీనిపై శాశ్వత చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు వేయాలని అధికారుల ను ఆయన ఆదేశించారు.
Related Articles
చంద్రబాబుకు మధ్యంతర బెయిలు మంజూరు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …
జలజగడంలో షర్మిల దారెటు..
తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధం మొదలైంది. ఈ వివాద…
శాన్ ఫ్రాన్సిస్కోలో లోకేశ్....బిజీ బిజీ
అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల…