విజయవాడ, ఆగస్టు 3: నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు. ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉండనున్నారు. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు నాలుగు బృందాలు వెళ్లనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీ, మద్యం షాపులు, బార్లు, లిక్కర్ ధరలు, మద్యం కొనుగోళ్లు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నాయి.అలాగే అక్రమ మద్యం నివారణ, డ్రగ్ కంట్రోల్‌పై కూడా అధికారుల బృందం అధ్యయనం చేయనుంది. ట్రాక్ అండ్ ట్రేస్, డీఅడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాల పైనా దృష్టి సారించనున్నారు. ఆయా రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలపై ప్రభుత్వానికి బృందాలు నివేదిక ఇవ్వనున్నాయి. ఆగస్ట్ 12వ తేదీ లోగా నివేదికలు సమర్పించాలని నాలుగు అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబరు 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.
Related Articles
చంద్రబాబు నిజంగా ఢిల్లీకి వచ్చారా.. బీజేపీ సెటైర్లు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email బీజేపీ జాతీయ కార్యదర్శి ఏపీ ఇన్చార్జి సునీల్ దేవధర్ సెటైర్లు చంద్రబాబు ఉనికిని గుర్తించని బీజేపీ టీడీపీ రాష్ట్రానికి హానికరం అంటూ ముక్తాయింపు టీడీపీ అధినేత చంద్రబాబు ఉనికిని సైతం గుర్తించడానికి బీజేపీ అధిష్టానం ఇష్టపడడం లేదు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారన్న సంగతి సైతం తమకు […]
ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email కృష్ణానది ఒడ్డున ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటపై దాడి చేసి ఘాతుకం అనంతరం పడవలో పారిపోయిన దుండగులు గుంటూరు/తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా సీతానగరం పుష్కర్ ఘాట్ సమీపంలో శనివారం రాత్రి ఓ యువతి అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియుడితో కలిసి […]
పలు మండలాలకు తాసిల్దార్ల నియామకంఆదేశాలు జారీ చేసిన కడప జిల్లా కలెక్టర్ శివశంకర్
బద్వేలు: బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ శివ శంకర్ నియమించారు ఎన్నికల ముందు కడప జిల్లాకు సంబంధించిన రెవెన్యూ అధికారులు ఇతర జిల్లాలకు వెళ్లడం జరిగింది ఇప్పుడు వీరంతా సొ…