విజయవాడ, ఆగస్టు 6: మాజీ మంత్రులు రోజా, అనిల్ కుమార్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు. ఇద్దరిపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి.. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణలో బాధితులు జనసే పార్టీ ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి ఫిర్యాదు చేశారు. టీటీడీలో ఉద్యోగాల ఇప్పిస్తామని చెప్పి మాజీ మంత్రులు రోజా, అనిల్ కుమార్ యాదవ్‌ల పేరుతో గీతా మాధురి అనే మహిళ ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షలు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. దాదాపు 40మంది దగ్గర డబ్బులు తీసుకుని.. అప్పటి ఈవో ధర్మారెడ్డి సంతకాలతో నియామక పత్రాలు, ఐడీ కార్డులు ఇచ్చి మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు.గతంలోనే ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. తాము చెల్లించిన రూ.5లక్షలు తిరిగి ఇప్పించి తమకు న్యాయం చేయాలని వారు రిక్వెస్ట్ చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే నాగమాధవి వెంటనే విజయవాడ పోలీసు కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు.. బాధితులకు న్యాయం చేయాలని, నకిలీ నియామక పత్రాలపై విచారణ చేపట్టాలన్నారు. తాను పనిచేస్తున్న కంపెనీ తనతో పాటు చాలామంది ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలేదని.. ఆరు నెలలుగా ఇబ్బంది పడుతున్నామని విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీ అనే మహిళ వినతిపత్రం అందజేశారు. పెనుకొండ మండలం నాగలూరుకు చెందిన పల్లపు మంజునాథకు తాతల ద్వారా సంక్రమించిన 5 ఎకరాల భూమిని తన చిన్నాన్న అయిన శనివారమప్ప వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి దౌర్జన్యంగా తీసుకున్నారని జనసేన పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ నేత నాగలూరు బాబురెడ్డి ద్వారా బెదిరింపులు చేసి రికార్డులు మార్చారని, తనకు న్యాయం చేయాలని కోరారు. 2024 జనవరిలో పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్లకు సంబంధిన పోస్టుల విషయంలో వైఎస్సార్‌సీపీ నేతలు అన్యాయం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. . మొదటి లిస్టులో సెలక్ట్ చేసి సర్టిఫికేట్ ధ్రువీకరణ కూడా పూర్తయిన వారిని తుదిలిస్టులో తొలగించారని, ఆ పోస్టులను కొందరికి అమ్ముకున్నారని చెప్పారు. ఉమ్మడి కడప జిల్లాలో 210 పోస్టులకు 137 మంది పేర్లు తొలగించారని, తమకు న్యాయం చేయాలని కోరారు.వైఎస్సార్‌సీపీ నేతలు కడప జిల్లాలోని పోలతల దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టు విషయంలో నిబంధనలు పట్టించుకోకుండా.. అర్హత లేని వారికి ఇష్టానుసారం పోస్టును కట్టబెట్టారని, రాత పరీక్ష రాసిన వారికి అన్యాయం చేశారని జనార్థన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.. తమనకు న్యాయం చేయాలన్నారు. జనసేన పార్టీ సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధి ఒకరు అందుబాటులో ఉంటారు.. ప్రజలు తమ సమస్యలపై వినతులు అందజేయొచ్చు.
Related Articles
విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్
విశాఖపట్టణం, ఆగస్టు 3: విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 30 ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల్లో అత్యధిక సీట్లున్న …
Janasena Meeting | రాష్ట్ర పెత్తనమంతా రెండిళ్లకే పరిమితం అంటే కుదరదు : పవన్ కల్యాణ్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email తన ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా ఉండేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజమహేంద్ర వరంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేసిన ఆయన అనంతరం బాలాజీపేటలో బహిరంగ […]
సినిమా స్టోరీ చెప్పిన స్వర్ణలత
విశాఖలో నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలిగా ఉన్న సీఐ స్వర్ణలత ఒక్కరోజు కస్టడీ ముగిసింది. ఆమెను గురువారం ఉదయం జైలు నుంచి తీసుకొచ్చి ఎంవీపీకాలనీ పోలీసుస్టేషన్లో ప్రశ్నించారు.. అనంతరం శుక్రవారం ఉదయం ఆమెను కేజీహెచ్‌కు తరల…