ఆంధ్రప్రదేశ్

చాగలమర్రి లో చౌడేశ్వరి అమ్మవారి ఘనంగా జయంతి వేడుకలు………

నంద్యాల: మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో వెలసిన చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతోత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు విశేషాలంకరణ నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయం వద్ద తీర్థ ప్రసాదాలు , అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ చౌడేశ్వరిదేవి అమ్మవారికి ఆషాడ మాసంలో అమావాస్యరోజున ఆమె జయంతి ఉత్సవాలను నిర్వహించడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోందని , ఉదయం నుంచి మహిళలు ఉపవాసాలతో దీక్ష చేసి అమ్మ వారికి పొంగళ్లు సమర్పించి బోనం మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు.మహిళల ఆధ్వర్యములో లలితా పారాయణం నిర్వహించారు.ఈ  కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు  బడిగెంచల రఘురాం ధర్మపత్ని అనుషా , బడిగెంచల చక్రపాణి ధర్మపత్ని మాధవీలత ,