ఆంధ్రప్రదేశ్ రాజకీయం

అధికారులతో మంత్రి నాదెండ్ల సమీక్ష

కాకినాడ: తాజాగా మంగళవారం మరోసారి మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ విచ్చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్ పి పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. .గతంలో పెట్టిన కేసులు పై ఆరా తీయడంతో పాటు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి రైస్ మిల్లుల వ్యవహారంపై తనిఖీలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు  చంద్రశేఖర్ రెడ్డిని పూర్తిగా ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూటమి నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ వదిలేసారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల సమీక్ష, పర్యటనపై చర్చ జరుగుతోంది.